Mobile Recharge Prices Increased 2026: సామాన్యులకు షాక్ ! మళ్ళీ రీఛార్జ్ ధరలు భారీగా పెంపు ఒక్క దానిపై ఎంత పెరుగుతుంది అంటే ?

Mobile Recharge Prices Increase: సామాన్యులకు షాక్ ! మళ్ళీ రీఛార్జ్ ధరలు భారీగా పెంపు ఒక్క దానిపై ఎంత పెరుగుతుంది అంటే ?

Mobile Recharge- కొత్త సంవత్సరం ప్రారంభం కాక ముందే మన దేశంలో మొబైల్ వినియోగదారులకు పెద్ద షాక్ తగలనుంది. ఎంత పెంచుతారొ కరెక్ట్ గా తెలియదు. కాని కొన్ని అంచనాల ప్రకారం క్రిందా ఎంత పెరుగుతుందో చేప్పాము.

. ప్రముఖ టెలికాం సంస్థలైన జియో , ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈ వార్త సోషల్ మీడియాలొ బాగా వైరల్గా మారింది. కాని ఈ పెంపు పై ప్రముఖ టెలికాం కంపెనిలు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కొందరు ప్రముఖ వ్యక్తులు రీఛార్చ్ ధరలు పెరుగుతాయని సూచిస్తున్నారు. ఈ పెంపు అమలులోకి వస్తే, వినియోగదారుల పై అధిక భారం పడుతుంది. ఇకపై మొబైల్ సేవలకు మనము మరింత అధికంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

 10 నుండి 12 శాతం లేదా 15 శాతమ్ ( అంచనా)

టెలికాం సంస్థలు తమ టారిఫ్‌లను 10% నుంచి 12 % లేదా 15% మధ్య పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపు ఎప్పుడు అమలులోకి వస్తుందో తెలియదు కాని కొన్ని అంచనాల ప్రకారం ఈ ధరల పెంపు డిసెంబర్ 2025 చివరి వారం నాటికీ లేదా జనవరి 2026 మొదటి వారంలో అమలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పెంపు అన్ని రకాల ప్లాన్‌లపైనా ప్రభావం చూపుతుంది. ఏ ప్లాన్ పై ఎంత ధర పెరుగుతుందో తెలుసుకోవాలను కుంతున్నారా అయితే ఒక్కసారి క్రిందా ఉన్న దాన్ని చూడండి అప్పుడు ఏ ప్లాన్ పై ఎంత పెరుగుతుందో తెలుస్తుంది.

కొన్ని ఉదాహరణలు ( అంచనా)

  *ప్రస్తుతం ₹199 ఉన్న నెలవారీ ప్లాన్ ధర సుమారు ₹222 వరకు . (అంచనా మాత్రమే)

 *ప్రస్తుతం ₹299గా ఉన్న నెలవారీ ప్లాన్ ధర, పెంపు తర్వాత సుమారు ₹343 వరకు చేరవచ్చు.దీనిపై 15% పెంపు ఒక వేల పెరిగితే ఇంత పెరుగుతుంది. (అంచనా మాత్రమే)

*​₹899 ముడు నెలల ప్లాన్ ధర ₹1006 వరకు చేరవచ్చని కొన్ని అంచనాలు మాత్రమే ఉన్నాయి.

 * ₹799 మూడు నెలల ప్లాన్ ధర సుమారు ₹918 వరకు పెరగవచాని (అంచనా మాత్రమే )

*వార్షిక ప్లాన్ (365 రోజులు) ₹2500 – ₹2999 ₹3500 – ₹3999 (అంచనా మాత్రమే)

ఈ పెంపు సామాన్య వినియోగదారులకు భారంగా మారనుంది, ముఖ్యంగా తక్కువ ధర ప్లాన్‌లను ఉపయోగించే వారికి నెలవారీ రీఛార్జ్ ఖర్చు పెరగనుంది.చివరి సారి దాదాపు అన్ని టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ధరలు బారిగా పెంచాయి. అప్పుడే వినియోగదారులకు ఎంతో కష్టంగా మారింది. ఇప్పుడు మల్ల ధరలు పెరుగుతాయి అంటున్నారు. మునుపటి టారిఫ్ పెంపులు విజయవంతం కావడంతో, ఈసారి కూడా నూతన సంవత్సరం సందర్భంగా ఈ రీఛార్జ్ ధరలు పెపునకు యోచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రీఛార్జ్ ధరలు పెరగడానికి కారణం అన్ని టెలికాం కంపెనిలు ఫ్రీగా AI ప్రీమియం ఇస్తున్నాయి. అందువల్ల ధరలు పెరుగుతున్నాయి.

అసలు రీఛార్జ్ ధరలు ఎందుకు పెరుగుతాయి

ప్రస్తుత కాలంలో 5G Network వినియోగం బాగా పెరిగింది. 5G వేగంగా అందాలంటే టవర్లను భూగర్భ ఫైబర్ కేబుల్స్‌తో అనుసంధానించాలి. దానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో మీకు తెలుసు. దాదాపు అన్ని టెలికాం సంస్థలు 5G పై భారీగా పెట్టుబడులకు పెట్టాయి. అప్పులు తీర్చడానికి లేదా వారి రాబడిని పెంచుకోవడానికి రీఛార్జ్ ధరలు పెంచుతున్నాయి.ఆపరేటింగ్ ఖర్చులు పరికరాల కొనుగోలు , నెట్‌వర్క్ నిర్వహణ వాటి వాటిపై ధరలు భాగా పెరిగాయి. వీటితో పాటు అనేక కారణాల వాళ్ళ ఈ టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ధరలు పెంచదనికి చూస్తున్నాయి. హై స్పీడ్ డాట కోసం వారు పెద్ద పెద్ద టవర్లు ఏర్పాటు చేయాలి . దానికి అధికంగా వ్యేయం అవుతుంది.ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది అందుకే ఆ భారం వినియోగదారుల మీద వేస్తున్నాయి. వాటికి కూడా ఖర్చులు పెరుగుతున్నాయి. అందువాళ్ళ ధరలు పెరుగు తున్నాయి.

5G సిగ్నల్ ఎక్కువ దూరం ప్రయాణించదు కాబట్టి ప్రతి వీధిలో లేదా తక్కువ దూరంలో చిన్న చిన్న టవర్లు ఏర్పాటు చేయాలి. దీనికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఇది కూడా ఒక కారణం.దానితో పాటు ఇప్పుడు 4G నెట్వర్క్ కంటే 5G నెట్వర్క్ ఎక్కువ కరెంట్ అవసరం ఆ బిల్ చెల్లిచడానికి టెలికాం కంపెనిలు అధిక వ్యయము అవసరం అవుతుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ప్రభుత్వానికి ఎంతో బాకీ ఉన్నాయి. వాటిని తీర్చడానికి ఈ విదంగా టరీఫ్ పెంచుతున్నట్లు సమాచారము.

చివరగా చెప్పాసింది ఏంటంటే 2026 లో కొత్త సంవసరంలో బాగా 15% నుండి 25% పెరిగే అవకాశం ఉంది. దీనికీ అనేక కారణాలు ఉన్నాయి. ధరలు పెరగడం ఏమో కాని సామాన్యుల జేబ్బులు ఖాళీ అవుతున్నాయి. ఈ టరీఫ్ పెంపుతో సామాన్యులకు కష్టం అవుతుంది అని చెప్పవచ్చు. మొన్నటి వరకు అన్ని టెలికాం కంపెనిలు ఫ్రీగా 5G నెట్వర్క్ ఇచ్చాయి. ఇది కేవలం కస్టమర్లను 5G వైపు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం. ఇప్పుడు ప్రైస్ పెంచుతున్నాయి. మంచి విషయం ఏంటంటే అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి, అధికారిక సమాచారం వచ్చే వరకు వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఏమో దీని పై అధికారిక ముందు భవిషతులో రావచ్చు అని అంచనా.

గమనిక : ఈ ధరల పెంపునకు సంబంధించి టెలికాం సంస్థల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది కేవలం ఇంటర్నెట్ అధారంగా మాత్రమే ఇవ్వబడింది. టెలికాం సంస్థల నుండి టరఫ్ పెంపు పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

India Ranks Third The World : AI లో మన దేశం మూడవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉంది ఆ దేశమే!

3 thoughts on “Mobile Recharge Prices Increased 2026: సామాన్యులకు షాక్ ! మళ్ళీ రీఛార్జ్ ధరలు భారీగా పెంపు ఒక్క దానిపై ఎంత పెరుగుతుంది అంటే ?”

Leave a Comment