Small investment :0 నుండి తక్కువ పెట్టుబడితో టాప్ 10 బిజినెస్ ఐడియాలు సింప్లీగా గ్రో అవుతారు!

Table of Contents

Small investment : 0 నుండి తక్కువ పెట్టుబడితో టాప్ 10 బిజినెస్ ఐడియాలు

Small investment ఈ రోజుల్లో, వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు.  కేవలం తక్కువ పెట్టుబడితో, సరైన అవగాహన, మరియు కష్టపడే గుణం ఉంటే చాలు, మీరు వ్యాపారాన్ని విజయవంతము చేయవచ్చు.

Small investment :తక్కువ పెట్టుబడితో ప్రారంభించదగిన 10 అద్భుతమైన వ్యాపారఆలోచనలు క్రిందా ఇవ్వబడాయి.

Redmi 15C Price in India : 6,000mAh పేద్ద బ్యాటరీతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ దీని ఫ్యూచర్స్ తెలిస్తే షాక్ అవుతారు

1. ఆన్‌లైన్ ట్యూటరింగ్/ఇ-లెర్నింగ్ (Online tutoring/e-learning)

* మూలధానం: చాలా తక్కువ (ఒక మంచి కంప్యూటర్/స్మార్ట్‌ఫోన్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం).మంచి నైపుణ్యం ఉంటే ఎలాంటి పెట్టుబడి ఇందులో అవసరం లేదు.
* వివరణ: మీకు ఏదైనా సబ్జెక్ట్‌లో (సైన్స్ , గణితం, కోడింగ్, సంగీతం వంటివి) లేదా నైపుణ్యంలో (ఫోటోగ్రఫీ, వంటలు, యోగా) మంచి విజ్ఞానము ఉంటే, ఆన్‌లైన్ ట్యూటోరింగ్ చేయవచ్చు.  మీరు మీ ఇంటి నుండే స్టూడెంట్స్కీ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాఠాలు చెప్పవచ్చు. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ నైపుణ్యానికి మంచి డిమాండ్ ఉన్నంత వరకు లాభాలు బాగా పెరుగుతాయి. Small investment

2. ఫ్రీలాన్సింగ్ (Freelancing )

*మూలధానం : సున్న నుండి చాలా తక్కువ పెట్టుబడి (ఉన్న నైపుణ్యంపై ఇది ఆధారపడి ఉంటుంది ).
వివరణ: మీకు కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ అండ్ అప్ డెవలప్‌మెంట్, వీడియో&ఫోటో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ లేదా ట్రాన్స్‌లేషన్ వంటి నైపుణ్యాలు ఉంటే, ఫ్రీలాన్సర్‌గా పని చేయండి.  Fiverr,Upwork  వంటి ప్లాట్‌ఫారమ్‌లలో లేదా నేరుగా క్రియేటర్లను సంప్రదించడం ద్వారా ప్రాజెక్ట్‌లను పొందవచ్చు.  ఇది మీ నైపుణ్యాన్ని డబ్బుగా మార్చుకోవడానికి ఇది ఈజీ Way.Small investment

Small investment
3. ఇంట్లో చేసిన ఆహార పదార్థాల వ్యాపారం (Homemade ఫుడ్)

* మూలధానం: కొంచం ఎక్కువ పెట్టుబడి అవసరం  (ముడిసరుకులు, ప్యాకేజింగ్ వంటి వాటికి పెట్టుబడి అవసరం).
* వివరణ: మీకు వంటలో నైపుణ్యం ఉంటే, ఇంట్లో లంచ్ బాక్సులు (టిఫిన్ సేవ), కేకులు,అచ్చులు, స్వీట్లు, లేదా ప్రత్యేకమైన ప్రాంతీయ స్నాక్స్‌ను తయారు చేసి అమ్మవచ్చు.  మీరు మీ కస్టమర్‌లకు నేరుగా డెలివరీ చేయవచ్చు లేదా స్థానిక ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యం చేసుకోవచ్చు.  రుచి, నాణ్యత, మరియు పరిశుభ్రత మీ వ్యాపార విజయానికి కీలకమైన అంశం.

4.సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ (Social Media Management)

* మూలధానం: చాలా తక్కువ (ఇంటర్నెట్, ప్రాథమిక మార్కెటింగ్ పరిజ్ఞానం ఎంతో అవసరం).
* వివరణ: చిన్న వ్యాపారులు తమ సోషల్ మీడియాను నిర్వహించడానికి కొందరు వ్యక్తులు కోరుకుంటారు.మీరు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్‌లు చేయడం, కంటెంట్ సృష్టించడం, ప్రకటనలను నిర్వహించడం వంటి సేవలను అవసరం అయినా వారికి అందించవచ్చు.  దీనికి మార్కెటింగ్ ట్రెండ్‌లు మరియు అనలిటిక్స్‌పై మంచి అవగాహన ఎంతో ముఖ్యం.

5. రీసెల్లింగ్ వ్యాపారం (Reselling Business లేదా E-commerce) 

* మూలధానం: తక్కువ (ప్రారంభ స్టాక్ కొనడం వంటి వాటికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది).
* వివరణ: మీరు తక్కువ ధరలో వస్తువులను కొనుగోలు(buy) చేసి, వాటిని ఆన్‌లైన్లొ లేదా మీ సొంత వెబ్‌సైట్, ఇన్‌స్టాగ్రామ్ లేదా Meesho/Amazon వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎక్కువ ధరకు అమ్మవచ్చు.  దుస్తులు, ఆభరణాలు, చేతిపనులు లేదా ప్రత్యేకమైన గాడ్జెట్‌ల వంటి వాటిని ఎంచుకోవచ్చు.  డ్రాప్‌షిప్పింగ్ మోడల్‌ను ఉపయోగించడం ద్వారా పెట్టుబడిని మరింత తగ్గించవచ్చు. ఇందులో మీరు స్టాక్‌ను మీ వద్ద ఉంచుకోకుండా, నేరుగా తయారీదారు నుండి కస్టమర్‌కు పంపిస్తారు ఇది స్మార్ట్ టెక్నిక్.

6.పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్/యోగా (Personal Fitness Trainer/Yoga)

* మూలధానం: తక్కువ నుండి చాలా తక్కువ (సర్టిఫికేషన్, ప్రాథమిక పరికరాలు వంటివి అవసరం).
* వివరణ: మీకు ఫిట్‌నెస్ లేదా యోగాలో నైపుణ్యం మరియు సర్టిఫికేషన్ ఉంటే, మీరు వ్యక్తిగత శిక్షణ తరగతులను ఆన్‌లైన్‌లో లేదా ఆరుబయట చేయవచ్చు.  మీరు కస్టమర్ల ఇళ్లకు వెళ్లి శిక్షణ ఇవ్వడం ద్వారా జిమ్‌లలో ఖరీదైన స్థలం అవసరాన్ని తగ్గించుకోవచ్చు.  ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ ఈ వ్యాపారానికి మరింత డిమాండ్‌ను పెంచుతోంది.

7.ఈవెంట్ ప్లానింగ్/పార్టీ ఆర్గనైజింగ్ (Event Planning/Party Organizing)

* మూలధానం: చాలా తక్కువ (నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ వంటి వాటికి కొంచెం పెట్టుబడి అవసరం అయ్యే అవకాశం ఉంది).
* వివరణ: మీకు నిర్వహణ నైపుణ్యాము మరియు మంచి నెట్‌వర్కింగ్ ఉంటే, చిన్న పుట్టినరోజు పార్టీలు, కిట్టి పార్టీలు లేదా కార్పొరేట్ ఈవెంట్‌లను నిర్వహించడంలో సహాయం చేసి డబ్బు సంపాదించవచ్చు.  ఈ వ్యాపారంలొ ప్రధానంగా సరఫరాదారులతో (కేటరర్లు, వేదికలు) మీ సంబంధాల మీద ఆధారపడుతుంది .  మొదట్లో చిన్న ఈవెంట్లతో ప్రారంభించి, మీ తరువాత దానిని పెద్దగా నిర్మించుకోవచ్చు.

8. కార్ క్లీనింగ్స్/మొబైల్ వెహికల్ వాష్ సర్వీసులు (Mobile Vehicle Wash Service)

* మూలధానం: తక్కువ నుండి ఎక్కువ (నీటి పంపు, నాణ్యమైన క్లీనింగ్ మెటీరియల్స్ వంతివి ఎక్కువగా అవసరం అయ్యే అవకాశం ఉంది).
* వివరణ: చాలా మందికి తమ వాహనాలను శుభ్రపరచడానికి లేదా సమయం ఉండదు.మీరు కస్టమర్‌ల ఇంటి వద్దకే వెళ్లి ఈ సేవను అందించి డబ్బు సంపాదించవచ్చు.మొబైల్ సర్వీస్ కాబట్టి, షాప్ అద్దె వంటి స్థిర ఖర్చులు తక్కువగా ఉంటాయి.దీనికి విశ్వసనీయత మరియు మంచి కస్టమర్ సేవ ముఖ్యమైనది.

9. హ్యాండీక్రాఫ్ట్స్ మరియు చేతితో తయారుచేసిన బహుమతుల విక్రయం (Handicrafts/Handmade Gifts) 

* మూలధానం: తక్కువ నుండి మధ్యస్థం (ముడిసరుకులు shop రేంటికి అవసరం).
* వివరణ: మీరు ప్రత్యేకమైన చేతిపనులు, పెయింటింగ్స్, జ్యువెలరీ లేదా సబ్బులు, కొవ్వొత్తులు వంటి ఇంటి అలంకరణ వస్తువులను తయారు చేయగలిగితే, వాటిని Etsy, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు లేదా స్థానిక ఎగ్జిబిషన్‌లలో విక్రయించవచ్చు.  మీ ఉత్పత్తుల నాణ్యత మరియు ప్రత్యేకత  కస్టమర్‌లను ఆకర్షించడానికి ఎంతో ఉపయోగపుడుతుంది.

10.ట్రావెల్ ఏజెంట్ (Travel agent) 

* మూలధానం: చాలా తక్కువ (నెట్‌వర్కింగ్, ఆన్‌లైన్ రిసోర్సెస్ వంటి వాటికి పెట్టుబడి అవసరం).
* వివరణ: మీరు ప్రయాణాలపై మక్కువ మరియు ట్రిప్‌లను ప్లాన్ చేయడంలో అనుభవం ఉంటే, ప్రత్యేకమైన లేదా నిర్దిష్ట ప్రయాణాలపై (ఉదాహరణకు, బడ్జెట్ ట్రిప్‌లు, తీర్థయాత్రలు, లేదా ట్రెక్కింగ్ టూర్లు) దృష్టి సారించే ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించవచ్చు.  మొదట్లో, ఆన్‌లైన్‌లోనే బుకింగ్‌లు మరియు ప్రణాళికలను నిర్వహించడం ద్వారా ఆఫీస్ స్థలం ఖర్చును తగ్గించవచ్చు.

వ్యాపారం ఏదైనా కావొచ్చు, విజయం సాధించడానికి మీరు ఎంచుకున్న ఆలోచనకు డిమాండ్ ఉందా లేదా తెలుసుకోవడం.ఖర్చులను, లక్ష్యాలను మరియు ఆదాయ మార్గాలను స్పష్టంగా నమోదు చేసుకోవడం. కస్టమర్‌లను చేరుకోవడానికి సోషల్ మీడియా మరియు వెబ్‌సైట్‌ను సమర్థవంతంగా ఉపయోగించడం.Small investment

1 thought on “Small investment :0 నుండి తక్కువ పెట్టుబడితో టాప్ 10 బిజినెస్ ఐడియాలు సింప్లీగా గ్రో అవుతారు!”

Leave a Comment